నేనే నా... నేనే నా ...
నీవులేక ఇకలోకంలేదనుకుంటుంటే... వింతగవుందీవేళా ...
నీ చూపులే లోకంలా
నీ నవ్వులే లోకంలా
నీ మౌనమే లోకంలా అనిపిస్తుంటే ... వింతగవుందీవేళా ...
మాటలు పెదవుల భందీ ఆయే
తనువేమో తూలేపోయే
ఖైదీనో కానో తెలియకపోయే
కానీ, నేను, నేను కాదనీ నీవని అర్ధం ఆయే .....
Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts
2.2.09
15.9.08
మిదుర
బుడి బుడి నడకలు , వడి వడి తలపులు
ఇరు లోకాలు కలిపే బోసి నవ్వులు
తల్లి జోలల, తండ్రి నీడల నిదురించు పాల బుగ్గలు
జిజ్ఞాస వలల చిక్కిన సమ్మోహన చేష్టలు,
మూగ సైగల అమాయక ప్రశ్నలు .. ఉబికే ఉత్సాహ అలలు
కోపాల కేకల ఆశ్చర్య అలకలు
ముద్దు మాటల , ముత్యాల మూటలు ..
కనుగొన్న క్రొంగొత్త ఆటల అయస్కాంత గోల
మా ఆశల దీపిక , మా ఆనందాల గుళిక
18.8.08
వదిలెల్లావు
నా జీవితం సముద్రపు ఒడ్డున నడకైతే ...
నే జాగ్రత్తపరుచుకున్న .. దాచుకున్న... రాళ్ళు , శంఖాలు , చిప్పలు అన్నీ
నీ జ్ఞాపకాలే ... గురుతులే ...
నీవులేక నిదురించిన నా కాలం ఇక కదలదా ?
నను కట్టిపడేసిన నిరీక్షణనుంచి నేనిక విడిపడనా ?
నే జాగ్రత్తపరుచుకున్న .. దాచుకున్న... రాళ్ళు , శంఖాలు , చిప్పలు అన్నీ
నీ జ్ఞాపకాలే ... గురుతులే ...
నీవులేక నిదురించిన నా కాలం ఇక కదలదా ?
నను కట్టిపడేసిన నిరీక్షణనుంచి నేనిక విడిపడనా ?
ఉషోదయం
నిరుటి రేయి నింగి వెదజల్లిన మంచు ముత్యాలని అలంకరించుకున్న పచ్చని పచ్చికను
తన లేలేత వేలుగురేఖల మునివ్రేళ్ళతో రవి పలకరిస్తూండగా
అలా తేలిపోయే గాలి పరకకూ పరకకూ మధ్య నెమ్మదిగా ఒదుగుతూండగా
వెలుగుతో విచ్చేసిన రంగులు కుసుమాల సొగసుకూ సుగందమునకూ వశమై రమిస్తూండగా
ఉషస్సు తూర్పును నులివెచ్చగా కావలించుకుంది.

17.8.08
గుట్టలం, కొండలం, గిరులం మేం
ఏనాటి నుంచో వున్నాం.. ఇకపై ఎన్నో నాళ్ళు వుండం కొన్నేళ్ళకు చెల్లిపోవచ్చు మా కాలం
కారణం .....
మీరే !
మనుషులు ... కాదు కాదు భువిపై మాకంటే పెద్ద మోతలు
మా వునికి హరిస్తున్న రాక్షసులు .. అంతకంటే మహా క్రూరులు
ఈ గుహలు మీ పూర్వుల గృహాలు...ఎండా వానకి రక్షణ కవచాలు
ఈ పర్వతాలు మీ దేవుళ్ళ ఆవాస క్షేత్రాలు
మానుంచే ఈ మీ నదులు జనితాలు
మేమే మీ నాగరికతకు పరోక్ష పునాదులం
నేడు పశాత్తపపడుతున్న అభాగ్యులం
వాడుకున్నారు ... గూటికని , కోటకని, వీటికని , వాటికని వాడుకున్నారు
నేడు .... వాడకం పెంచుకున్నారు
నింగి ముంగిటనున్న మా తలలు త్రుంచి...నేలకీడుస్తున్నారు
సున్నపు రాళ్ళని, పాలిష్ బండలని
నగరాలకని వాటి దార్లకని
భావనాలకని వాటి పునాదులకని
గుళ్ళకని వాటిలో విగ్రహాలకని
నల్లరాయి, రంగురాయి, పాలరాయి పనికొచ్చేది అచ్చోచ్చేది అని
మమ్మల్ని గిల్లుతూ తొలుస్తూ కూలుస్తూ ప్రేలుస్తూ పోడిచేస్తున్నారు, పొడిగా చేస్తున్నారు
మా ఆనవాళ్ళు కరిగిస్తూ, చేరిపేస్తున్నారు.
మేం జడులం, కదల్లేం...లేకుంటే
లేకుంటే ... మాకే కాళ్ళుంటే
మిమ్మల్ని పాతాళానికి త్రొక్కి
ప్రకృతికి స్వేఛ్చనిచ్చే వాళ్ళం

8.8.08
ఏ తార కాంచినా
ఏ మబ్బు మారినా
ఏ పువ్వు విరిసినా
నీ రూపమే నేను చూసేను కాదా?
మరి ఏలా ననుచేర రావేల నీవు !
ఏ అందే మ్రోగినా
చిరుగాలి వీచినా
ఏ చిలుక పలికినా
నీ మాటలే నేను విన్నాను కాదా ?
మరి ఏలా ననుచేర రావేల నీవు !
ఏ రాగం పాడినా
ఏ తీగ మీటినా
ఏ తపము చేసినా
నీ కొరకే నే చేసెను కాదా?
నిను తలచి నే వేచేను కాదా ?
మరి ఏలా ననుచేర రావేల నీవు !
ఏ మబ్బు మారినా
ఏ పువ్వు విరిసినా
నీ రూపమే నేను చూసేను కాదా?
మరి ఏలా ననుచేర రావేల నీవు !
ఏ అందే మ్రోగినా
చిరుగాలి వీచినా
ఏ చిలుక పలికినా
నీ మాటలే నేను విన్నాను కాదా ?
మరి ఏలా ననుచేర రావేల నీవు !
ఏ రాగం పాడినా
ఏ తీగ మీటినా
ఏ తపము చేసినా
నీ కొరకే నే చేసెను కాదా?
నిను తలచి నే వేచేను కాదా ?
మరి ఏలా ననుచేర రావేల నీవు !
28.7.08
23.7.08
వ్యర్ధ రచన
స్పృహ వంపులో,
ఎండిన నెత్తుటి జిగట, నుదిటి రాతకు తెరవేయగా
దిగుడు బావి కేక బీడు వారిన పెదాలని కదల్చలేక
కుహరంలో ధ్వనించి అంతరించగా..
ధహించి మసవుతున్న ప్రేగుల మొరని
కుచించిన కడుపు వీపునకు విన్నవిస్తున్న వేళలో ...
నీరింకిన నయనపు లోయ,
జాలి... అన్న రెండక్షరాలు ఏ మదినైనా జనించునని ఎదురు చూడగా!
జీర్ణమైన ఆశల సౌధం నిరాశల సుడిన చిక్కి వెక్కిరించగా
శిఖరాగ్రపు మెతుకుల మూట పాతాలపు నాసికను తన్ని పరిహసించగా
చర్మపు దుస్తులని పదినాళ్ళ ఆకలితో అలంకరించి హత్తుకొని
జీవనం అన్న రథచక్రపు ఇరుసు విడిపడి(నా)
మరణపు అంగడిలో చావు అన్న పదార్దం కొనే స్థోమతలేక
లెక్కతెలియని శ్వాసల ఆస్తులతో
ఎన్నొ మినుకుపాటు వైభోగాలు
ఎటువంటి సంతసపు సీమను చేరక
ఎగసి ఎగసి విరిగి ముగిసే ఎన్నొ బ్రతుకు కెరటాలు.
మానవత్వమా... నిన్నెన్నడో మంటగలిపాము.

13.7.08
ఏమని పలుకను?
యద దాపున అలజడులనెట్లు తెనుcగింపను?
పలు దారులన్ గొనిపోవు కాల కరములను ఖడ్గమునై ఖండింపనా..
కిరీటినై విధిన్ భందింప శరములను సందింపనా
శక్యము కాజాలదు, మరల ఇలా మధుర స్నేహములన్ పొంద
నిక్కము తెలుపు చుంటి!
సంతసమును పిలిచి పంచిరి
హృదయభారమును అదిగి అందుకొనిరి.
లేశమైననూ దయ లేదు కదా పైనున్నవానికి
పెనవేయ ముడితీయ మానులమనుకొంటిడి
హ్c
లేదు మార్గము మౌనముగా కాల కదలికలను కాంచుటకన్నా ...
అరెరె ... మరిచితి
మరిచితినెట్లో స్మృతి సౌరభమ్ములను
ఎట్లు విస్మరించితినో .. ఙ్ఞాపకాల కొలనందు పసిడి కాంతులను
సురాభాండ ఆరాధకులను,
పొగ ప్రేమికులనూ పేక చక్రవర్తులను
కూర్చిన నామములను,
చెరగని నవ్వులనూ చెలించని స్ధైర్యములను.
ఇవే కదా దొచలేని సొమ్ములు
తలంచిన దోసిట నిండు అంతరించని ఆస్తులు.
ధన్యుడిని కదా ...మీ సాంగత్య సంపద దొరక!!

-- To my MCA friends. (written at time of course completion)
8.7.08
6.7.08
పేపరు ముక్క
ఎప్పుడు కలిసావో నీవు, ఈ పుస్తకానికి
ఎన్నాల్లనించి ఇలా అతుక్కుపొయావో? ఈ పుస్తకానికి!
ఎన్ని వూసులు చెప్పుకున్నారో ...
ఎంత అనుబంధం పెంచుకున్నారో ...
పని లేని, ఆలోచన లేని ఓ చేయి...
మిమ్మల్ని, ఈ ముక్క- ఆ పుస్తకంగా, వేరు చేసింది.
కనరాని మరో వేదనను జగత్తుకు జత చేసింది.

అంతరాత్మ
నన్ను చంపేస్తున్నాడు... చంపేస్తున్నాడు!
మౌనంగా రోదించినా మీకు కనబడట్లేదా?
గొంతు చించుకు అరచినా మీకు వినబడట్లేదా?
ఎప్పుడూ ఇచ్చానే గాని ఆడిగింది లేదు
తోచినది చెప్పానే గాని పెత్తనం చేయలేదు
ఐనా చంపేస్తున్నాడు ...
మెల్లగా --- మె ...ల్ల...గా ...
నా ఆవేదన నన్ను చంపెస్తున్నాడనే కాదు
ఎవ్వరూ అడగట్లేదే అని ..
ఇన్ని ముఖాలు వీడు మారుస్తున్నా చీ కొట్టట్లేదే ?
ఎందుకు అసహ్యించుకోట్లేదు !! మీ...రూ... హంతకులేనా?

2.7.08
సమాజం
అరిచాడు
ఊరుకున్నాను
ఊరుకోకన్నారు
అరిచాడు
తిట్టాను
బురదనోరన్నారు
తిట్టాడు
ఊరుకున్నాను
ఊరుకుంటెట్లన్నారు
తిట్టాడు
కొట్టాను
రౌడి వెదవన్నారు
మీ ఇష్టమా!
అనడిగాను
నోరు మాది! అన్నారు
చెవులు మూసుకున్నాను
నన్నడిగి నడచుకున్నాను .
ఊరుకున్నాను
ఊరుకోకన్నారు
అరిచాడు
తిట్టాను
బురదనోరన్నారు
తిట్టాడు
ఊరుకున్నాను
ఊరుకుంటెట్లన్నారు
తిట్టాడు
కొట్టాను
రౌడి వెదవన్నారు
మీ ఇష్టమా!
అనడిగాను
నోరు మాది! అన్నారు
చెవులు మూసుకున్నాను
నన్నడిగి నడచుకున్నాను .
1.7.08
ట్రాఫిక్
ఇటు పొతే జాం
అటు పొతే జాం...
ఎటు పోయినా ఆ పోటు తప్పదు
ట్రాఫిక్ లో చిక్కక తప్పదు
అలవాటొ పొరబాటో
పట్టుబడక తప్పదు
ఫ్లై ఓవర్, గో అండర్ ఏదైనా ఒకటే
ఎట్లైనా ఇక్కట్లే
రెండు బండ్లాగితే...
మనకూ బ్రేకు పడ్డట్లే
మరో నిమిషంలో రోడ్డుమాయమైనట్లే..
టైం ఐపోతే
రంగు పడ్డట్లే..
పెట్రోలూ ఐపోతే
సంక నాకినట్లే
వీదుల్లో, సందుల్లో, దొడ్డి, రహ దారుల్లొ
నేను...నేను...నేనున్నాగా అంటూ ప్రత్యక్షం
పాతబస్తి.. కొత్తపేట.. లేదే పక్షపాతం
పద్మ వ్యూహం అబ్బతో అది సిద్దం.
ఝయ్ ఝయ్ జాయ్ జాయ్ రోజులు
ఎపుడొ పాయె
గుయ్ గుయ్ కీ కీ కయ్యి కయ్యి
ఇవే ఎదురాయె
అరవై ఫీటు రోడ్డా...
ఐతే అరగంటే లేటు, ఒకరితొనే ఫైటు ...

28.6.08
24.6.08
Subscribe to:
Posts (Atom)