9.6.08

నింగిన నిలిచిన మబ్బుల్లారా
ఆపేయండా అలక్ష్య కబుర్లు
నేల నలు చెరుగులకు గోడుగవ్వండి
కారు వర్ణంతో కమ్మేయ్యండి

వచ్చె వచ్చె నని గర్జిస్తూ
గళ్ళ దుప్పట్లలా కురుస్తూ
కొకిల్లకూ నెమళ్ళకూ మత్తెక్కిస్తూ
వచ్చేయ్యండీ..విచ్చేయ్యండీ

ఎడారి,బీళ్ళను వనాలు మింగెయ్యాలి
భూమి కాల్వల వలువలెయ్యలి

సప్త వర్ణ ధనుస్సంధించండి
బడ బడ నాపై వర్షించండి
ఆ చినుకుల స్పర్షకై
నా లొన, లోలోన వున్న నేను
చర్మ పొరలను చీల్చుకు రావాలి, మీ వశమవ్వాలి

హుష్.. మంటూ మొదలెట్టి
టప చప మంటూ భువి తట్టి
నేల అర్పించు మట్టి వాసనలకై
ఛం ఛం మంటూ చలువను చిమ్మి

ఇక ధిగి వచ్చిన తమరు అబ్ధి ఆలింగనకై...
గల గల మంటూ సాగే దోవని
ఛరళ్ హరళ్ మంటూ మరలించి
సుడుల ముళ్ళతో చలన కంపనలు రగిలించి
లేళ్ళ కాళ్ళను అరువుకు తెచ్చుకు
ఇంకుతూ ధుముకుతూ నురగలు క్రక్కుతూ
సౌమ్య రాగాల, రౌద్ర నాదాల, స్వేఛ్ఛా నాట్యాల సృజిస్తూ సాగండి.