26.7.08

My heart, Me and You

In its own language, in a million ways
about you, unto me, so much it says
when I think of you, a beat it skips
when you are around, about me(& its rhythm) it forgets

Is she the one ? I asked
It answered.
"Eyes search to reflect her, Every moment
ears wish to hear even her whisper
&myself dear, I'm crushed in paradise"
Life,
In an unbothering, unknowing ignorance was cruising...
So silent, so calm, so peaceful and so pleasant...
not a momentary brood over the certain past or uncertain future.
Actions and thoughts .... hand in hand.
Sleeping... was to close the eyes and summon the slave,
to be opened only to the fresh morn's warmth.

Then,
A turn,
which direction?? I fail remembering!
Is it fate? am I destined??
did ego creep in? OR uninvited half knowledge walked in??
A change...Not so sudden but slowly and signally
past began to haunt & future's face turned fierce.

Thinking, thinking...
inconclusive unending unfruitful -- thoughts.
Sleep... seemed a distant relative
& health... to be discovered under dense fog.
Life.. inescapable reality.
Death.. a late comer.
God ..the only hope.

23.7.08

వ్యర్ధ రచన

స్పృహ వంపులో,
ఎండిన నెత్తుటి జిగట, నుదిటి రాతకు తెరవేయగా
దిగుడు బావి కేక బీడు వారిన పెదాలని కదల్చలేక
కుహరంలో ధ్వనించి అంతరించగా..
ధహించి మసవుతున్న ప్రేగుల మొరని
కుచించిన కడుపు వీపునకు విన్నవిస్తున్న వేళలో ...
నీరింకిన నయనపు లోయ,
జాలి... అన్న రెండక్షరాలు ఏ మదినైనా జనించునని ఎదురు చూడగా!
జీర్ణమైన ఆశల సౌధం నిరాశల సుడిన చిక్కి వెక్కిరించగా
శిఖరాగ్రపు మెతుకుల మూట పాతాలపు నాసికను తన్ని పరిహసించగా
చర్మపు దుస్తులని పదినాళ్ళ ఆకలితో అలంకరించి హత్తుకొని
జీవనం అన్న రథచక్రపు ఇరుసు విడిపడి(నా)
మరణపు అంగడిలో చావు అన్న పదార్దం కొనే స్థోమతలేక
లెక్కతెలియని శ్వాసల ఆస్తులతో
ఎన్నొ మినుకుపాటు వైభోగాలు
ఎటువంటి సంతసపు సీమను చేరక
ఎగసి ఎగసి విరిగి ముగిసే ఎన్నొ బ్రతుకు కెరటాలు.

మానవత్వమా... నిన్నెన్నడో మంటగలిపాము.
ఎటకో ఎందుకో పయనమిది
బ్రతుకే వెంటపడి తరిమినది
ఏ దారైనా నీతో కలవనీదే...

నిశిలో ఏదిశకు భయపడెనో
నీడే నన్నువిడి పొయినది
ఐనానొంటరైనాను పగ ఎవరిదో...

మెరిసే తారలతొ నీ ఊసే
మరిగే మనసునకు నీ ద్యాసే
తెలిసీ ఓ సఖియా ఇంత అలుసా...

మౌనం కానించు నీ దహనం
గమనం కాలేదు ఇంకా కఠినం
గరళం మారగలదా ఎంత మాత్రం...
హృదయం ఒర్వగలదా ఇంత మథనం.