23.7.08

వ్యర్ధ రచన

స్పృహ వంపులో,
ఎండిన నెత్తుటి జిగట, నుదిటి రాతకు తెరవేయగా
దిగుడు బావి కేక బీడు వారిన పెదాలని కదల్చలేక
కుహరంలో ధ్వనించి అంతరించగా..
ధహించి మసవుతున్న ప్రేగుల మొరని
కుచించిన కడుపు వీపునకు విన్నవిస్తున్న వేళలో ...
నీరింకిన నయనపు లోయ,
జాలి... అన్న రెండక్షరాలు ఏ మదినైనా జనించునని ఎదురు చూడగా!
జీర్ణమైన ఆశల సౌధం నిరాశల సుడిన చిక్కి వెక్కిరించగా
శిఖరాగ్రపు మెతుకుల మూట పాతాలపు నాసికను తన్ని పరిహసించగా
చర్మపు దుస్తులని పదినాళ్ళ ఆకలితో అలంకరించి హత్తుకొని
జీవనం అన్న రథచక్రపు ఇరుసు విడిపడి(నా)
మరణపు అంగడిలో చావు అన్న పదార్దం కొనే స్థోమతలేక
లెక్కతెలియని శ్వాసల ఆస్తులతో
ఎన్నొ మినుకుపాటు వైభోగాలు
ఎటువంటి సంతసపు సీమను చేరక
ఎగసి ఎగసి విరిగి ముగిసే ఎన్నొ బ్రతుకు కెరటాలు.

మానవత్వమా... నిన్నెన్నడో మంటగలిపాము.

No comments: