22.8.08

వృద్దాప్యమే శాపంగా పరిణమిచ్చినప్పుడు
కన్నబిడ్డలే వంచించినప్పుడు
వెన్ను నిలవక వంగినప్పుడు
ఆకలి తప్ప తోడు అగుపడనప్పుడు
శుష్కించిన శరీరంలో శోష నిలవనప్పుడు
వెర్రి గొంతుకతో పిలిచినా.. ఘోషించినా ...
ఏ దేవుడు దిగివచ్చును ?
ఏ నామము పలికిన .. ఆ నారాయణుండు ఆదుకొనును ?
నా దేశము భారతమ్ముకేలా ఈ దుస్తితి
కూడు కూడా కరువైన కఠినమైన పరిస్థితి?

చిరిగిన చీరే చీనాంబరికాగా
గీరిన వచ్చే కొబ్బరి చిప్పలోని కొసరే పరమాన్నముకాగా
తన భాధలు అనుచుకొని
పిల్లల బాగు తలచుకొని
శ్వాసించే ముసలిది ...
కాదా ఓ ఆడది ??
మరి ఎందుకమ్మా ఓ పరాశక్తీ ..
కనులప్పగించుకొని చూసేవు ?
కట్టలేదా రక్తి ఈ ఆట ఇంకా !
పాడు ప్రాణాలు పొమ్మన్నా పోవు !!


పూర్వపు వైభవము పూర్వికులకే తెలియును
ఇక్ష్వాకులు ఏలిన రాజ్యమున
భిక్షువులేల మిగిలెను !!
రక్షకులు రాక్షసులవ్వగా
దేవుళ్ళు ప్రేక్షకులవ్వగా
మనం, తోటి మానవులం .. స్వార్ధులమై .. భీరువులమై ... పేడ పురుగులకన్న హీనులమైనప్పుడు ...
మరి.. రాదా ఈ దుస్తితి ... కూడు కూడా కరువయ్యే పరిస్థితి !!!
అందంగా అగుపించి భంధించి భాదించేదే ప్రేమ
కవ్వించి కాటు వేసే గుణమే ప్రేమ
వేదనకు మరో మార్గమే ఈ ప్రేమ
మైకంలో నిను ముంచి మంత్రం వేసి ..
తనే సర్వమని తనమాటే వేదమని నిన్ను నీవు మరిచేలా మురిపిస్తుందీ ప్రేమ..
మత్తు దిగిన క్షణాన నిన్నే నీవు ద్వేషించేలా చేసి నవ్వుతూ నిష్క్రమిస్తుందీ ప్రేమ.

19.8.08

ఎవరివమ్మా దేవి
ఎవరివయా స్వామీ
ఏం మాయ నాయనా
ఏం విచిత్రమమ్మా
ఆకారమా నీవసలు నిరాకారమా
ఏం చేసితివని
ఏం చూపితివని
ఇందరికి ఇంత నమ్మకం
కొందరికి కొండంత నమ్మకం !

ఆకలికి మాడినా
కదగండ్లకి కాగినా
లేమి కౌగిట నలిగినా
నీ మీద అంతంత నమ్మకం !

ఓ మాట నిన్ననరు
ఓర్పుతో మనిగేరు
నేడో రేపో మాపో
వస్తావు వస్తావు వస్తావని
ఈ పరీక్షలు నీ వళ్ళో ముగుస్తాయని
వీరికి ఏమంత నమ్మకం !

భయానికి బెదరరు
భక్తిని విడవరు
అరె ఏం విన్నారని ఏం కన్నారని
ఎక్కడిది వీరికి ఈ నిలువంత నమ్మకం !

నాకెరుక లేనిదేదో తెలుసు వీరికి
నను పలుకరించననుభవమేదో కలిగే వీరికి
నా కంటికందనిదేదో నిత్యం వీరినంటిపెట్టుకునుంది !!

18.8.08

వదిలెల్లావు

నా జీవితం సముద్రపు ఒడ్డున నడకైతే ...
నే జాగ్రత్తపరుచుకున్న .. దాచుకున్న... రాళ్ళు , శంఖాలు , చిప్పలు అన్నీ
నీ జ్ఞాపకాలే ... గురుతులే ...

నీవులేక నిదురించిన నా కాలం ఇక కదలదా ?
నను కట్టిపడేసిన నిరీక్షణనుంచి నేనిక విడిపడనా ?

ఉషోదయం

నిరుటి రేయి నింగి వెదజల్లిన మంచు ముత్యాలని అలంకరించుకున్న పచ్చని పచ్చికను
తన లేలేత వేలుగురేఖల మునివ్రేళ్ళతో రవి పలకరిస్తూండగా
అలా తేలిపోయే గాలి పరకకూ పరకకూ మధ్య నెమ్మదిగా ఒదుగుతూండగా
వెలుగుతో విచ్చేసిన రంగులు కుసుమాల సొగసుకూ సుగందమునకూ వశమై రమిస్తూండగా
ఉషస్సు తూర్పును నులివెచ్చగా కావలించుకుంది.

17.8.08

గుట్టలం, కొండలం, గిరులం మేం
ఏనాటి నుంచో వున్నాం.. ఇకపై ఎన్నో నాళ్ళు వుండం కొన్నేళ్ళకు చెల్లిపోవచ్చు మా కాలం
కారణం .....
మీరే !
మనుషులు ... కాదు కాదు భువిపై మాకంటే పెద్ద మోతలు
మా వునికి హరిస్తున్న రాక్షసులు .. అంతకంటే మహా క్రూరులు

ఈ గుహలు మీ పూర్వుల గృహాలు...ఎండా వానకి రక్షణ కవచాలు
ఈ పర్వతాలు మీ దేవుళ్ళ ఆవాస క్షేత్రాలు
మానుంచే ఈ మీ నదులు జనితాలు
మేమే మీ నాగరికతకు పరోక్ష పునాదులం
నేడు పశాత్తపపడుతున్న అభాగ్యులం

వాడుకున్నారు ... గూటికని , కోటకని, వీటికని , వాటికని వాడుకున్నారు
నేడు .... వాడకం పెంచుకున్నారు
నింగి ముంగిటనున్న మా తలలు త్రుంచి...నేలకీడుస్తున్నారు
సున్నపు రాళ్ళని, పాలిష్ బండలని
నగరాలకని వాటి దార్లకని
భావనాలకని వాటి పునాదులకని
గుళ్ళకని వాటిలో విగ్రహాలకని
నల్లరాయి, రంగురాయి, పాలరాయి పనికొచ్చేది అచ్చోచ్చేది అని
మమ్మల్ని గిల్లుతూ తొలుస్తూ కూలుస్తూ ప్రేలుస్తూ పోడిచేస్తున్నారు, పొడిగా చేస్తున్నారు
మా ఆనవాళ్ళు కరిగిస్తూ, చేరిపేస్తున్నారు.

మేం జడులం, కదల్లేం...లేకుంటే
లేకుంటే ... మాకే కాళ్ళుంటే
మిమ్మల్ని పాతాళానికి త్రొక్కి
ప్రకృతికి స్వేఛ్చనిచ్చే వాళ్ళం
what makes a poet?
do words or do thoughts?
is it his questionnaire to nature or conclusions drawn from self ?

are comparisons his key & pure wishes his wealth
do stylish expression makes him rule
or immersed depth declares him prince ?

does he set a time or forget it ?
is it by any chance inbuilt or an unknown angel's passing gift?

Is anguish its source
or is it result of overwhelming happiness
are facts his inspiration or is he just led by imagination?

Is it a sudden outburst without a calculated flow
or born from a rhythmic pulse with its own high and low?

how can he touch those notes of emotional music ?
can his own, single experience summon it ?
or he just resonates, what the supreme creates?