22.8.08

వృద్దాప్యమే శాపంగా పరిణమిచ్చినప్పుడు
కన్నబిడ్డలే వంచించినప్పుడు
వెన్ను నిలవక వంగినప్పుడు
ఆకలి తప్ప తోడు అగుపడనప్పుడు
శుష్కించిన శరీరంలో శోష నిలవనప్పుడు
వెర్రి గొంతుకతో పిలిచినా.. ఘోషించినా ...
ఏ దేవుడు దిగివచ్చును ?
ఏ నామము పలికిన .. ఆ నారాయణుండు ఆదుకొనును ?
నా దేశము భారతమ్ముకేలా ఈ దుస్తితి
కూడు కూడా కరువైన కఠినమైన పరిస్థితి?

చిరిగిన చీరే చీనాంబరికాగా
గీరిన వచ్చే కొబ్బరి చిప్పలోని కొసరే పరమాన్నముకాగా
తన భాధలు అనుచుకొని
పిల్లల బాగు తలచుకొని
శ్వాసించే ముసలిది ...
కాదా ఓ ఆడది ??
మరి ఎందుకమ్మా ఓ పరాశక్తీ ..
కనులప్పగించుకొని చూసేవు ?
కట్టలేదా రక్తి ఈ ఆట ఇంకా !
పాడు ప్రాణాలు పొమ్మన్నా పోవు !!


పూర్వపు వైభవము పూర్వికులకే తెలియును
ఇక్ష్వాకులు ఏలిన రాజ్యమున
భిక్షువులేల మిగిలెను !!
రక్షకులు రాక్షసులవ్వగా
దేవుళ్ళు ప్రేక్షకులవ్వగా
మనం, తోటి మానవులం .. స్వార్ధులమై .. భీరువులమై ... పేడ పురుగులకన్న హీనులమైనప్పుడు ...
మరి.. రాదా ఈ దుస్తితి ... కూడు కూడా కరువయ్యే పరిస్థితి !!!

1 comment:

vivekananda said...

This is too good ra. No words to praise.