17.8.08

గుట్టలం, కొండలం, గిరులం మేం
ఏనాటి నుంచో వున్నాం.. ఇకపై ఎన్నో నాళ్ళు వుండం కొన్నేళ్ళకు చెల్లిపోవచ్చు మా కాలం
కారణం .....
మీరే !
మనుషులు ... కాదు కాదు భువిపై మాకంటే పెద్ద మోతలు
మా వునికి హరిస్తున్న రాక్షసులు .. అంతకంటే మహా క్రూరులు

ఈ గుహలు మీ పూర్వుల గృహాలు...ఎండా వానకి రక్షణ కవచాలు
ఈ పర్వతాలు మీ దేవుళ్ళ ఆవాస క్షేత్రాలు
మానుంచే ఈ మీ నదులు జనితాలు
మేమే మీ నాగరికతకు పరోక్ష పునాదులం
నేడు పశాత్తపపడుతున్న అభాగ్యులం

వాడుకున్నారు ... గూటికని , కోటకని, వీటికని , వాటికని వాడుకున్నారు
నేడు .... వాడకం పెంచుకున్నారు
నింగి ముంగిటనున్న మా తలలు త్రుంచి...నేలకీడుస్తున్నారు
సున్నపు రాళ్ళని, పాలిష్ బండలని
నగరాలకని వాటి దార్లకని
భావనాలకని వాటి పునాదులకని
గుళ్ళకని వాటిలో విగ్రహాలకని
నల్లరాయి, రంగురాయి, పాలరాయి పనికొచ్చేది అచ్చోచ్చేది అని
మమ్మల్ని గిల్లుతూ తొలుస్తూ కూలుస్తూ ప్రేలుస్తూ పోడిచేస్తున్నారు, పొడిగా చేస్తున్నారు
మా ఆనవాళ్ళు కరిగిస్తూ, చేరిపేస్తున్నారు.

మేం జడులం, కదల్లేం...లేకుంటే
లేకుంటే ... మాకే కాళ్ళుంటే
మిమ్మల్ని పాతాళానికి త్రొక్కి
ప్రకృతికి స్వేఛ్చనిచ్చే వాళ్ళం

No comments: