18.6.08

వీరిది ఈ దేశం కాదు !
వీరిది ఆ దేశమూ కాదు !!
మరి వీరెవరు ?

కాగితపు ప్రపంచంపై గీసిన గీతలు
అవివేకపు ఇనుప గోడలై అడ్డుకొనగా
వీరికి వీరే అంతా ఐ
అవతలి వారు వదిలించుకొని
ఇవతలి వారు ఇదిలించుకొని
అటు ఇటు ఎర్పడిన దేశాల నడుమ
మిగిలిపోయారు కుమిలిపోతూనేవున్నారు
ప్రకృతి లోగిలినుంచి మనల్ని మనం వెలి వేసుకొని
పట్నంలో ఏదో మూల బొమ్మా బొరుసులకి ముడివేసుకొని
బ్రతుకుకు దూరంగా బ్రతుకుతెరువు బరువు మోస్తూ
అద్దిన ఇంటివాసనలు ఆవిరైపొగా మిగిలిన గొడల దాపున
అంటుకుంటున్న కాలం చలి మంటని భ్రమిస్తూ
పైపై పూతల కింద పులుస్తున్న మనల్ని మరుస్తూ
ఎటొ ఎందుకో, ఆలోచించక చెసే పయనం
కోకిలను చూస్తూ చేసే గార్ధబ గానం.
వెతికా...
అంతా నీవేనట.. నిజమేనా?
మరి కనరావే?
ఏ? దాగవా? లేక నాబొటి వాడికి అగుపడవా

అలా చెయ్యి.. ఇలా వుండు..
నిన్ను కరునిస్తాడు నీకు మంచిచెస్తాడు
ఏ ?
లేక పొతే చేయడా ?

అలా వద్దు.. ఇలా కాదు..
ఏ ? దండిస్తాడా శిక్షిస్తాడా...

ఇన్ని ఆశల మధ్య ఇన్ని భయాల తో...
దేని కొరకు?

అస్తిత్వం తెలుస్తుందిగా ..
అన్ని ప్రశ్నలే...

వెతకటం చేతవ్వకపొతే
లేక వెతుకుతున్నది లేనే లేకపోతే
దొరకదట.
మరి నీ సంగతేంటొ ??

16.6.08

Death

How long will you get stirred in this confusion land
take a step and grab ITs hand..
out of the scary dark night of indecision & unhappiness
into the soothing light of peace and nothingness, IT will take thee
till then make to thyself a help
burden not yourself with rules you can't follow
tighten not yourself in lies you can't live with