5.7.08

సౌక్యం సాహసం సగటుతనం

పట్టించుకోకుండా పాత దారిలో పోయే వాడొకడు
నచ్చక కొత్త దారి కనిపెట్టి సాగే వాడింకొకడు
కొత్తంటే భయంతో నచ్చకపోయినా పాతలో వెళ్ళి తప్పిపోయేవాడు వేరొకడు.

4.7.08

phoenix & me

O' phoenix what is your age in years?
As, from thine own pyre thou rise again
with new vigour, to rove over welkin.
what do thou imply ? that death spawns life OR no death chains life ?

I too am a far-flung kind of yours!
Every day dying, but finding myself undead again
shorn of fervor, to rave over nothin'...
what should I imply? that life holds death OR no life wipes death ?

2.7.08

సమాజం

అరిచాడు
ఊరుకున్నాను
ఊరుకోకన్నారు

అరిచాడు
తిట్టాను
బురదనోరన్నారు

తిట్టాడు
ఊరుకున్నాను
ఊరుకుంటెట్లన్నారు

తిట్టాడు
కొట్టాను
రౌడి వెదవన్నారు

మీ ఇష్టమా!
అనడిగాను
నోరు మాది! అన్నారు

చెవులు మూసుకున్నాను
నన్నడిగి నడచుకున్నాను .

1.7.08

ట్రాఫిక్

ఇటు పొతే జాం
అటు పొతే జాం...
ఎటు పోయినా ఆ పోటు తప్పదు
ట్రాఫిక్ లో చిక్కక తప్పదు
అలవాటొ పొరబాటో
పట్టుబడక తప్పదు
ఫ్లై ఓవర్, గో అండర్ ఏదైనా ఒకటే
ఎట్లైనా ఇక్కట్లే
రెండు బండ్లాగితే...
మనకూ బ్రేకు పడ్డట్లే
మరో నిమిషంలో రోడ్డుమాయమైనట్లే..

టైం ఐపోతే
రంగు పడ్డట్లే..
పెట్రోలూ ఐపోతే
సంక నాకినట్లే

వీదుల్లో, సందుల్లో, దొడ్డి, రహ దారుల్లొ
నేను...నేను...నేనున్నాగా అంటూ ప్రత్యక్షం
పాతబస్తి.. కొత్తపేట.. లేదే పక్షపాతం
పద్మ వ్యూహం అబ్బతో అది సిద్దం.

ఝయ్ ఝయ్ జాయ్ జాయ్ రోజులు
ఎపుడొ పాయె
గుయ్ గుయ్ కీ కీ కయ్యి కయ్యి
ఇవే ఎదురాయె
అరవై ఫీటు రోడ్డా...
ఐతే అరగంటే లేటు, ఒకరితొనే ఫైటు ...