28.6.08

కాలం తన మానాన తను పయనిస్తోంది
తన గమనాన్ని గతంలోకి నెడుతూ...
తన కోండెకి తగులుకు నేనూ కదులుతున్నా
లేస్తూ.. పడుతూ.. భవిష్యత్ తడుముతూ...
మా పాప కనుపాపలలసినవేళ
రావమ్మా నిదురా రావే, కనుకొసల దారిన చెరవే..
ఒడిలోకి తీసుకొని ఓపాట పాడవే ..

కనులు తెరచు వరకు ఏ కలత కంట పడనీకు
కమ్మన్ని కలలను కాసేపు చూపించు
ఊ కొట్టు బుజ్జాయికి కొత్త కథలు వినిపించు

జో జో మని అందువో? లాలి పాట అందుకొందువో
ఏవైనా ఏట్లైనా తన అలుపంతా ఆవిరై, తిరిగి అల్లర్లు చేయాలి

26.6.08

What is a Ghazal

Very clear and simple explanation : http://smriti.com/urdu/ghazal.def.html

24.6.08

శాంత రాశిలో ఏకాంత లయలో నిశ్శబ్దంగా రమిస్తూ
తలా తోచినంత దోచినా, చిరు నగవు చిందిస్తూ
ప్రకృతినీ పుస్తకాలనీ కుక్క పిల్లుల్నీ ప్రేమిస్తూ
సోమ మొదలు ఆది వరకు మధ్యానికి అభయమిస్తూ
చింతాకంత చింత కరువై తొనికేంత తృప్తికి నెలవై
బ్రతికేస్తూ....బాసు.