బుడి బుడి నడకలు , వడి వడి తలపులు
ఇరు లోకాలు కలిపే బోసి నవ్వులు
తల్లి జోలల, తండ్రి నీడల నిదురించు పాల బుగ్గలు
జిజ్ఞాస వలల చిక్కిన సమ్మోహన చేష్టలు,
మూగ సైగల అమాయక ప్రశ్నలు .. ఉబికే ఉత్సాహ అలలు
కోపాల కేకల ఆశ్చర్య అలకలు
ముద్దు మాటల , ముత్యాల మూటలు ..
కనుగొన్న క్రొంగొత్త ఆటల అయస్కాంత గోల
మా ఆశల దీపిక , మా ఆనందాల గుళిక