5.7.08

సౌక్యం సాహసం సగటుతనం

పట్టించుకోకుండా పాత దారిలో పోయే వాడొకడు
నచ్చక కొత్త దారి కనిపెట్టి సాగే వాడింకొకడు
కొత్తంటే భయంతో నచ్చకపోయినా పాతలో వెళ్ళి తప్పిపోయేవాడు వేరొకడు.

4.7.08

phoenix & me

O' phoenix what is your age in years?
As, from thine own pyre thou rise again
with new vigour, to rove over welkin.
what do thou imply ? that death spawns life OR no death chains life ?

I too am a far-flung kind of yours!
Every day dying, but finding myself undead again
shorn of fervor, to rave over nothin'...
what should I imply? that life holds death OR no life wipes death ?

2.7.08

సమాజం

అరిచాడు
ఊరుకున్నాను
ఊరుకోకన్నారు

అరిచాడు
తిట్టాను
బురదనోరన్నారు

తిట్టాడు
ఊరుకున్నాను
ఊరుకుంటెట్లన్నారు

తిట్టాడు
కొట్టాను
రౌడి వెదవన్నారు

మీ ఇష్టమా!
అనడిగాను
నోరు మాది! అన్నారు

చెవులు మూసుకున్నాను
నన్నడిగి నడచుకున్నాను .