15.9.08

నింగినే నేలకమ్మనడిగే నాకేమైనదో

మండుటెండలో మంచు కావలింత ఎలా కుదిరెనో

మనస్సు నిలవకున్నది తనువు తూగుతున్నది

వింతగా చల్లగా వేడిగా హాయిగా వున్నది

రారమ్మని సైగ చేసి పిలిచెను ఎవరది ఏమది ?

మెల్లగా, వెళ్ళగా, చూడగా, తెలిసెను అది నా మది అని

కనుల ముంగిట క్రొత్త లోకమున్నది, నన్ను తనలో ఒక్కటవ్వమన్నది ..

వజ్రాలు పరిచినట్టు మెరిసినా ..నడిచిన మబ్బులా ఒదిగినది

వెన్నెలమ్మ లాంతరు ... సెలయేటి హోరు ... తీయ్యటి అంతః పోరు .....

No comments: