15.9.08

పలుకే చిలక ..ఎలా అలక

కునుకే కరువై వేచా నీకై...

ఎందుకే... ఎందుకే ..ఎందుకే ..ఈ మౌనమ్

గుండె కోత అగుపించినా రాదేలా చెలీ చెలనం ?

వెతికా లోకం సర్వం నేను నీకోసం

మనసు విరిచి.. దాగుట అవ్వునా న్యాయం ?

వినిపించనీ ... వివరించనీ.... నాకు తెలియని , నేను చేసిన తప్పిదం ...

నింగినే నేలకమ్మనడిగే నాకేమైనదో

మండుటెండలో మంచు కావలింత ఎలా కుదిరెనో

మనస్సు నిలవకున్నది తనువు తూగుతున్నది

వింతగా చల్లగా వేడిగా హాయిగా వున్నది

రారమ్మని సైగ చేసి పిలిచెను ఎవరది ఏమది ?

మెల్లగా, వెళ్ళగా, చూడగా, తెలిసెను అది నా మది అని

కనుల ముంగిట క్రొత్త లోకమున్నది, నన్ను తనలో ఒక్కటవ్వమన్నది ..

వజ్రాలు పరిచినట్టు మెరిసినా ..నడిచిన మబ్బులా ఒదిగినది

వెన్నెలమ్మ లాంతరు ... సెలయేటి హోరు ... తీయ్యటి అంతః పోరు .....

మిదుర

బుడి బుడి నడకలు , వడి వడి తలపులు

ఇరు లోకాలు కలిపే బోసి నవ్వులు

తల్లి జోలల, తండ్రి నీడల నిదురించు పాల బుగ్గలు

జిజ్ఞాస వలల చిక్కిన సమ్మోహన చేష్టలు,

మూగ సైగల అమాయక ప్రశ్నలు .. ఉబికే ఉత్సాహ అలలు

కోపాల కేకల ఆశ్చర్య అలకలు

ముద్దు మాటల , ముత్యాల మూటలు ..

కనుగొన్న క్రొంగొత్త ఆటల అయస్కాంత గోల

మా ఆశల దీపిక , మా ఆనందాల గుళిక