13.7.08

ఏమని పలుకను?
యద దాపున అలజడులనెట్లు తెనుcగింపను?
పలు దారులన్ గొనిపోవు కాల కరములను ఖడ్గమునై ఖండింపనా..
కిరీటినై విధిన్ భందింప శరములను సందింపనా
శక్యము కాజాలదు, మరల ఇలా మధుర స్నేహములన్ పొంద
నిక్కము తెలుపు చుంటి!
సంతసమును పిలిచి పంచిరి
హృదయభారమును అదిగి అందుకొనిరి.
లేశమైననూ దయ లేదు కదా పైనున్నవానికి
పెనవేయ ముడితీయ మానులమనుకొంటిడి
హ్c
లేదు మార్గము మౌనముగా కాల కదలికలను కాంచుటకన్నా ...

అరెరె ... మరిచితి
మరిచితినెట్లో స్మృతి సౌరభమ్ములను
ఎట్లు విస్మరించితినో .. ఙ్ఞాపకాల కొలనందు పసిడి కాంతులను
సురాభాండ ఆరాధకులను,
పొగ ప్రేమికులనూ పేక చక్రవర్తులను
కూర్చిన నామములను,
చెరగని నవ్వులనూ చెలించని స్ధైర్యములను.
ఇవే కదా దొచలేని సొమ్ములు
తలంచిన దోసిట నిండు అంతరించని ఆస్తులు.
ధన్యుడిని కదా ...మీ సాంగత్య సంపద దొరక!!

-- To my MCA friends. (written at time of course completion)

No comments: